NBK 108: 'విజయదశమికి ఆయుధపూజ'.. ఎన్‌బీకే 108 రిలీజ్ రివీల్‌

నందమూరి నటసింహాం బాలకృష్ణ.. లేటెస్ట్‌ మూవీ నుంచి సాలిడ్‌ అప్డేట్‌ వచ్చింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌ తెగ సంబరాలు

By అంజి  Published on  31 March 2023 3:00 PM IST
Balakrishna , NBK 108, Kajal Aggarwal

NBK 108: 'విజయదశమికి ఆయుధపూజ'.. ఎన్‌బీకే 108 రిలీజ్ రివీల్‌

నందమూరి నటసింహాం బాలకృష్ణ.. లేటెస్ట్‌ మూవీ నుంచి సాలిడ్‌ అప్డేట్‌ వచ్చింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఎన్‌బీకే 108 సినిమా తెరకెక్కుతోంది. సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాను ఈ సంవత్సరం విజయదశమి కానుకగా రిలీజ్‌ చేయనున్నట్లు మూవీ టీమ్‌ వెల్లడించింది. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ విషయాన్ని తెలియజేస్తూ.. బాలకృష్ణ మాస్‌ పోస్టర్‌ను ట్విటర్‌లో రిలీజ్‌ చేశారు. ఇందులో రౌద్రంగా బాల‌కృష్ణ క‌నిపిస్తోన్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో కాళీమాత విగ్ర‌హం ఉండటం ఆస‌క్తిని పంచుతోంది. దశమికి ఆయుధపూజ అంటూ క్యాప్షన్‌ జోడించారు.

ఎన్‌బీకే 108 కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్ కాని ఈ చిత్రంలో 'పెళ్లి సందD' ఫేం శ్రీలీల కీ రోల్‌ పోషిస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. బాల‌కృష్ణ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ్రీలీల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తోన్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

Next Story