లైగర్ సెట్‌లో బాలయ్య.. ఫోటోలు వైరల్
Balakrishna makes surprise visit to liger sets today.విజయ్‌దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్
By తోట వంశీ కుమార్ Published on
22 Sep 2021 9:14 AM GMT

విజయ్‌దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'లైగర్(సాలా క్రాస్ బ్రీడ్)'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద ఛార్మీ, పూరి కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతోంది. విదేశీ ఫైటర్లతో విజయ్ దేవరకొండ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
తాజాగా చిత్రబృందానికి నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ ఇచ్చారు. బాలకృష్ణ లైగర్ సెట్ ను సందర్శించారు. బాలయ్య అక్కడ కనిపించడంతో మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ సైతం ఆశ్చర్యపోయారు. బాలయ్యతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. గతంలో బాలకృష్ణతో పూరి 'పైసా వసూల్' సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
Next Story