షూటింగ్‌లో బాలయ్య కాలికి గాయం..!
Balakrishna leg injured in Aha shoot.షూటింగ్‌లో నందమూరి బాలకృష్ణ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. అయితే..
By తోట వంశీ కుమార్ Published on 9 Oct 2021 12:29 PM ISTషూటింగ్‌లో నందమూరి బాలకృష్ణ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. అయితే.. అది చిన్నగాయమేనని, కంగారు పడాల్సిందేమీకాదని సమాచారం. షూటింగ్ సమయంలో దెబ్బతగిలినప్పటకీ బాలయ్య అదేమీ పట్టించుకోకుండా షూటింగ్‌ను పూర్తి చేశారట. ఇటీవల అఖండ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య.. ఆహాలో ప్రసారం కానున్న టాక్ షో కోసం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ప్రోమో షూటింగ్‌లో పాల్గొన్నారట. ప్రొమో షూట్ సమయంలో బాలయ్య కాలుకి చిన్న గాయమైంది. కానీ సమయం వృధా చేయకుండా గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఫోటో షూట్ కానిచ్చేశారట బాలయ్య. షూట్ పూర్తయ్యాక ఆయన కాలికి చికిత్స చేసుకున్నారట. పని పట్ల ఆయనకు ఉన్న అంకితభావం అభిమానులను ఫిదా చేసేస్తోంది.
ఇదిలా ఉంటే.. మరి కొద్ది రోజులలో బాలయ్య టాక్ షోకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది. ఈ టాక్ షోకి ప్రొగ్రాం ప్రొడ్యూసర్‌గా క్రిష్ వ్యవహరించబోతున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ టాక్ షో కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, వెంకటేష్, చిరంజీవి వంటి వారిని తీసుకువచ్చేందుకు ఆహా బృందం ప్రయత్నిస్తోందట. ఇక షోకి అన్‌స్టాపబుల్ అనే టైటిల్ పరిశీలిస్తుండగా.. తొలి ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇక బాలయ్య నటించిన అఖండ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య అఘోరాగా కనిపించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి విడుదలైన లుక్, టీజర్‌లు రికార్డులు క్రియేట్ చేశాయి.