సంక్రాంతికి విజృంభించ‌నున్న 'వీర‌సింహారెడ్డి'

Balakrishna Is Ready To Hunt As The Title Of His Next Is 'Veera Simha Reddy'.నంద‌మూరి బాల‌కృష్ణ‌, గోలిచంద్ మ‌లినేని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2022 10:20 AM IST
సంక్రాంతికి విజృంభించ‌నున్న వీర‌సింహారెడ్డి

నంద‌మూరి బాల‌కృష్ణ‌, గోలిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. మాస్ యాక్ష‌న్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోండ‌గా.. దునియా విజ‌య్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఏ పేరు పెడుతారోన‌ని అభిమానులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. శుక్ర‌వారం రాత్రి క‌ర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గ‌ర టైటిల్ లోగోను లాంచ్ చేశారు. ఈ చిత్రానికి 'వీర సింహా రెడ్డి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 'గాడ్ ఆఫ్ మాసెస్‌'.. అన్న‌ది ఉప‌శీర్షిక‌.

నెర‌సిన జుట్టు, న‌ల్ల‌చొక్కా, పంచె ధ‌రించిన బాల‌య్య మాస్ లుక్‌లో ద‌ర్శన‌మిచ్చాడు. టైటిల్‌తో పాటు విడుద‌ల తేదీని చెప్పేశారు. సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

టైటిల్ విడుద‌ల సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ.. ఓ బాల‌య్య అభిమాని, స‌మ‌ర‌సింహారెడ్డి ఫ్యాన్ ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందో వీర‌సింహారెడ్డి అలాగే ఉంటుంది. బాల‌య్య‌ను అభిమానులు ఎలా చూడాల‌ని అనుకుంటున్నారో అంత‌కు రెండింత‌లు ఈ సినిమాలో చూపించాం. సంక్రాంతికి మ‌న వీర‌సింహారెడ్డి విజృంభించ‌బోతున్నాడు. ఈ చిత్రం పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.

Next Story