ఎవ‌రిని బాధ పెట్టాల‌న్న ఆలోచ‌న నాకు లేదు.. పొర‌పాటును మ‌న్నించండి : బాల‌కృష్ణ‌

Balakrishna Apologizes to Deva Brahmins.ప్ర‌మోష‌నల్స్‌లో భాగంగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌య్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jan 2023 2:10 PM IST
ఎవ‌రిని బాధ పెట్టాల‌న్న ఆలోచ‌న నాకు లేదు.. పొర‌పాటును మ‌న్నించండి : బాల‌కృష్ణ‌

సంక్రాంతికి 'వీర‌సింహారెడ్డి' చిత్రంతో వ‌చ్చి ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌. అయితే.. ఈ చిత్ర ప్ర‌మోష‌నల్స్‌లో భాగంగా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌య్య మాట్లాడిన కొన్ని వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయ్యాయి. తాజాగా వాటిపై బాల‌య్య స్పందించారు. తాను చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల దేవ బ్రాహ్మ‌ణుల మ‌నోభావాలు దెబ్బ‌తినాయ‌ని తెలిసి తాను చాలా బాధ‌ప‌డిన‌ట్లు బాల‌య్య చెప్పారు. ఎదుటి వాళ్ల‌ను బాధ‌పెట్టే ఉద్దేశం త‌న‌కు లేద‌న్నారు.

‘దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని నాకు అందిన సమాచారం తప్పని తెలియజేసిన దేవ బ్రాహ్మణుల పెద్దలు అందరికీ కృతజ్ఞతలు. నేను అన్న మాటవల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచనలేదని, ఉండదని తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకాగా వచ్చిన మాట మాత్రమే. సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకు వచ్చే ప్రయోజం ఏం ఉంటుంది చెప్పండి?. దేవ బ్రాహ్మణులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’ అని బాల‌కృష్ణ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Next Story