బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య సింహ‌గ‌ర్జ‌న‌.. వంద కోట్ల క్ల‌బ్‌లోకి 'అఖండ'

Balakrishna Akhanda Roaring Record at Box office.బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Dec 2021 9:16 AM GMT
బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య సింహ‌గ‌ర్జ‌న‌.. వంద కోట్ల క్ల‌బ్‌లోకి అఖండ

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం 'అఖండ‌'. డిసెంబ‌ర్ 2న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌రోనా సెకండ్ వేవ్ త‌రువాత థియేట‌ర్ల‌లో విడుద‌లైన పెద్ద సినిమా ఇదే కావ‌డంతో అంద‌రి చూపు ఈ చిత్రంపైనే ఉంది. ఇక విడుద‌లైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ వ‌ద్ద ఈ చిత్రం క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో బాల‌య్య త‌న కెరియ‌ర్‌లోనే తొలిసారిగా వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటి వరకు బాలయ్య కెరిర్‌లో ఎక్కువ గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిన సినిమాగా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ఉండ‌గా.. ఇప్పుడు ఆ రికార్డును అఖండ ప‌ది రోజుల్లోనే బ‌ద్ద‌లు కొట్టింది.

నైజాంలో రూ.16.50 కోట్లు, సీడెడ్ లో రూ.12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5.10 కోట్లు, గుంటూరులో రూ.3.96 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.3.39 కోట్లు, కృష్ణాలో రూ.2.99 కోట్లు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో రూ.2.80 కోట్లు, నెల్లూరులో రూ.2.15 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి మొత్తంగా రూ.49.34 కోట్ల షేర్ వ‌చ్చింది. కర్ణాటకతో పాటు మిగతా రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్‌లో మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. మొత్తంగా 58.74 కోట్ల షేర్ రాగా.. రూ.100కోట్ల గ్రాస్‌ను దాటిన‌ట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

రూ.53కోట్ల వ‌ర‌కు అఖండ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుగ‌గా.. రూ.54 కోట్ల టార్గెట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం కేవ‌లం ఎనిమిది రోజుల్లోనే ఈ టార్గెట్‌ను చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు కోట్ల వ‌ర‌కు లాభాల‌ను అందుకున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు అఖండ ఊపిరి పోసిన‌ట్లుగా చెప్ప‌వ‌చ్చు.

Next Story
Share it