బాల‌య్య అభిమానుల‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది

Balakrishna 107th movie special announcement.జూన్ 10న నందమూరి బాలకృష్ణ అభిమానుల‌కు పండుగ రోజు. ఎందుకంటే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2021 3:55 AM GMT
బాల‌య్య అభిమానుల‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది

జూన్ 10న నందమూరి బాలకృష్ణ అభిమానుల‌కు పండుగ రోజు. ఎందుకంటే.. నేడు బాల‌య్య పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న నందమూరి తెలుగు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నంద‌మూరి అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది. ఆయ‌న క‌థానాయ‌కుడిగా తెర‌కెక్క‌నున్న‌107వ చిత్రం గురించి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల అయ్యింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న ఈచిత్రానికి గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి తెలియ‌జేస్తూ.. చిత్ర నిర్మాణ సంస్థ ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ కథను రెడీ చేసుకున్న గోపిచంద్ 'క్రాక్' తరహాలోనే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సీన్స్ రాసిన్నట్లు సమాచారం. ఇక సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించనున్నట్లు టాక్ వచ్చింది. గోపీచంద్ మలినేని మాస్ ప్రేక్షకులకు నచ్చేలా మరోసారి ఫుల్ మీల్స్ లాంటి సినిమాతోనే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బాల‌య్య న‌టిస్తున్న చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్నఈచిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒకరోజు ముందుగానే అఖండ పోస్టర్ ను కూడా విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే.

Next Story