బాలయ్య 107వ చిత్ర షూటింగ్ ప్రారంభం
Balakrishna 107 movie shooting launched.నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయన
By తోట వంశీ కుమార్ Published on 13 Nov 2021 7:58 AM GMT
నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన 'అఖండ' చిత్రం విడుదలకు సిద్దమవుతుండగా.. మరో చిత్రాన్ని బాలయ్య లైన్‌లో పెట్టారు. బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్‌లో జరిగాయి. గోపించంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. పూజా కార్యక్రమంలో దర్శకులు హరీష్ శంకర్, వివి వినాయక్, కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు.
#NBK107Begins 🦁 pic.twitter.com/Nq5P7JymcG
— Mythri Movie Makers (@MythriOfficial) November 13, 2021
ముహూర్తం షాట్‌కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. వివి వినాయక్ క్లాప్ కొట్టారు, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా చిత్ర స్క్రిప్ట్‌ని టీమ్‌కి అందజేశారు. మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారట. తమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.