బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ఇప్పుడే అసలు ఆట మొదలైంది. తొలి వారంలో ఏడుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్న కంటెస్టెంట్లకు కెప్టెన్సీ బండి అనే టాస్క్ ఇచ్చారు. జబర్ధస్త్ ఫైమా ఈ ఆటకు సంచాలక్‌గా వ్యవహరించింది. కెప్టెన్సీ కోసం ఆదిరెడ్డి, బాలాదిత్య, రేవంత్, ఆరోహి, చాందిని చౌదరి, ఆర్జే సూర్య, మెరీనా, గీతూ, రోహిత్ లు పోటిపడ్డారు. మొత్తానికి బాలాదిత్య విజేతగా నిలిచి సీజన్ 6లో మొదటి కెప్టెన్ అయ్యాడు. 'కిందపైనా ఊపు బాలాదిత్య తోపు.. మా ఇంట్లో పెరుగు లేదు.. బాలాదిత్యకి తిరుగులేదు' అంటూ ఇంటి సభ్యులు అతన్ని సింహాసనం పై కూర్చోబెట్టారు.
అనంతరం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించారు. వాళ్లని జైలుకి పంపాలని సూచించాడు. తొలుత రేవంత్.. గీతూని నామినేట్ చేయాలని బావించాడు. అయితే.. ఆమెకు పీరియడ్స్ కావడంతో జైలుకు పంపడం ఇష్టం లేదని, దీంతో ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. సుదీప, చలాకీ చంటీ, రాజశేఖర్, ఇనయా, శ్రీసత్య, ఆరోహి, సూర్య, వాసంతి,నేహా, మెరీనా దంపతలు,అర్జున్‌లు గీతూనే వరస్ట్ పర్ఫార్మర్ అంటూ ఓటు వేశారు. ఎక్కువ ఓట్లు రావడంతో .. ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్‌గా గీతూ ఎన్నికైంది.
అయినప్పటికీ గీతూ ఏ మాత్రం తగ్గలేదు. గేమ్ కోసం ఏం చేయడానికైనా తాను సిద్దం అని, ఒకవేళ తన తల్లిదండ్రులను తీసుకువచ్చినా వాళ్లని వెనక్కినెట్టి తాను గెలవాలని కోరుకుంటానని చెప్పుకొచ్చింది. అనంతరం ఆమెను జైలుకి పంపారు. ఈ మధ్యలో ఇనయా, శ్రీహాన్ కి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఇనయా శ్రీహాన్ లవర్ పేరు తీసుకురాగా శ్రీహాన్ మండిపడ్డాడు. బయటి వాళ్ళ పేర్లు తీయొద్దు అంటూ ఫైర్ అయ్యాడు.