జూలై 14న రాబోతున్న 'బేబీ'

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా యువ దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ బేబీ.

By Sumanth Varma k
Published on : 17 May 2023 9:27 AM IST

Baby movie, Tollywood, Anand Devarakonda, Vaishnavi Chaitanya

జూలై 14న రాబోతున్న 'బేబీ'

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా యువ దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ బేబీ. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరీ ఈ ఏడాది జూలై 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ మరియు పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని సినిమా పైమంచి హైప్ ను క్రియేట్ చేశాయి. పైగా మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఈ రేంజ్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టాయి.

ప్రేమ మేఘాయిల్లా, అలాగే దేవరాజా అనే రెండుపాటలు భారీ బ్లాక్‌బస్టర్‌లు సాధించాయి, ఇక ప్రేమిస్తున్నా అంటూ వచ్చిన మూడవ పాట కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మూవీలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ సినిమాని నిర్మించారు. మరి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Next Story