'బేబీ' బ్లాక్‌ బాస్టర్‌ కాంబో మళ్లీ రిపీట్‌

బేబీ సినిమా ఈ ఇయర్ టాలీవుడ్‌ కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే.. ఈ బ్లాక్‌ బస్టర్‌ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on  21 Oct 2023 8:15 AM IST
Baby movie, combo repeat, tollywood,

'బేబీ' బ్లాక్‌ బాస్టర్‌ కాంబో మళ్లీ రిపీట్‌

చిన్న సినిమాగా వచ్చిన 'బేబీ' సినిమా ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే కలెక్షన్లలో రికార్డులను తిరగరాసింది. బేబీ సినిమా ఈ ఇయర్ టాలీవుడ్‌ కల్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే.. ఈ బ్లాక్‌ బస్టర్‌ కాంబో మళ్లీ రిపీట్ కాబోతుంది. తనకి కలిసివచ్చిన హీరోయిన్‌ వైష్ణవి చైతన్యను నువ్వే కావాలని అంటున్నాడు ఆనంద్‌ దేవరకొండ. దాదాపు బేబీ సినిమాలో ఉన్న వారే మరో సినిమాతో ముందుకు రాబోతున్నారు.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా 100 కోట్ల గ్రాసింగ్ ప్రొడక్షన్ హౌస్ మాస్ మూవీ మేకర్స్,"కలర్ ఫొటో"తో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న బ్యానర్ అమృతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే దర్శకుడు మాత్రమే మారుతున్నారు. ఈసారి కూడా సాయి రాజేష్, ఎస్ కె ఎన్ లే ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏడుస్తూ ఉన్న వైష్ణవిని ఆనంద్‌ ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తు్ంది. చూస్తుంటే ఇది కూడా ఓ విరహ ప్రేమకథే అన్నట్లుగా కనిపిస్తుంది. బేబీలో విడిపోయిన వీరిద్దరూ మరి ఈ సినిమాలో కలుస్తారా అన్నది ఇంట్రెస్టింగ్.

బేబీ దర్శకుడు సాయి రాజేశ్‌ ఈ సినిమాకి కథ అందిస్తుండగా... నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి ఈ చిత్రాన్ని రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా మారబోతున్నాడు. అంతకముందు రవి నంబూరి.. ‘3 రోజెస్‌’ వెబ్‌సిరీస్‌కు రచయితగా, ‘ప్రతిరోజూ పండగే’కు కో రైటర్‌, చీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా 2024 సమ్మర్ కు రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Next Story