ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 14న విడుదలై. భారీ వసూళ్లను సాధిస్తూ వస్తోంది. విడుదలైన రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో.. ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 23.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడం.. విజయ్ దేవరకొండ తమ్ముడు కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలోని బోల్డ్ సీన్స్ పై కూడా బాగా చర్చ జరుగుతూ ఉంది. తొలి సినిమాలోనే బోల్డ్ సీన్స్‌లో నడించడంపై వైష్ణవి చైతన్య స్పందించింది. రొమాన్స్, లిప్‌లాక్ సీన్లలో నటించడం చాలా కష్టమని, కానీ బేబీ టీమ్ తనను కంఫర్ట్‌గా చూసుకుందని వైష్ణవి తెలిపింది. ఆ సీన్ చేసే రోజు సెట్లో చాలా తక్కువ మంది ఉండేలా జాగ్రత్త పడ్డారని.. బోల్డ్ సీన్స్ చేసే సమయంలో విరాజ్ అశ్విన్ కూడా సాయపడ్డాడని వైష్ణవి చైతన్య తెలిపింది. సినిమా కోసం ఇంత వరకూ చాలా సీన్లు చేశాం. ఇది కూడా అలాంటిదే అనుకో అని ధైర్యం చెప్పారని తెలిపింది. ఆయా సీన్స్‌ను తాను సన్నివేశంలో భాగంగానే చూశానని చెప్పుకొచ్చింది. సినిమా చూశాక ఇంట్లో వాళ్లూ కూడా అలాగే ఆలోచించారని తెలిపింది.