బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి కన్నుమూత

ప్రముఖ జ్యోతిష్యుడు మరియు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం పంజాబ్‌లోని ఓ

By అంజి  Published on  19 May 2023 6:45 PM IST
Ayushmann Khurrana, famous astrologer, P Khurrana, Bollywood news

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి కన్నుమూత 

ప్రముఖ జ్యోతిష్యుడు మరియు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం పంజాబ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారులు ఆయుష్మాన్, అపరశక్తి ఖురానాలు ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానా తండ్రి ప్రముఖ జ్యోతిష్కుడుగా పేరు తెచ్చుకున్నారు. పి ఖురానా పంజాబ్‌లోని మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. గుండె జబ్బు కారణంగా గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.

"ఆయుష్మాన్, అపరాశక్తి ఖురానా తండ్రి, జ్యోతిష్యుడు పి ఖురానా ఈ రోజు ఉదయం 10:30 గంటలకు మొహాలిలో మరణించారు. ఈ విషయం తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం. ఈ సమయంలో మీ ప్రార్థనలు, మద్దతు మాకు కావాలి" అని ఖురానా కుటుంబం నుండి అధికారిక ప్రకటన వచ్చింది.

Next Story