అవికా బర్త్ డే స్పెషల్.. కొత్త మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్
Avika Gor first glimpse in Sreedhar Seepaana movie.చిన్నారి పెళ్లికూతురిగా తెలుగు వారికి పరిచయమైన
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2021 6:39 AM GMT
చిన్నారి పెళ్లికూతురిగా తెలుగు వారికి పరిచయమైన అవికాగోర్.. చిన్నప్పుడే స్టార్ డమ్ సంపాదించుకుంది. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్తా మావా' సినిమాల్లో హీరోయిన్ గా నటించి యువత హృదయాలను కొల్లగొట్టింది. ఓ దశలో వరుస సక్సెస్‌లతో దూసుకుపోయిన ఈ భామ.. తరువా అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్‌కు దూరమైంది. కొంత గ్యాప్ తరువాత ఇటీవల 'రాజు గారి గది 3' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే పూర్తి దృష్టిపెట్టింది అమ్మడు.
యువ కథానాయకులు నాగచైతన్యతో పాటు కల్యాణ్ దేవ్ కు జతగా నటిస్తోంది. కాగా.. నేడు యంగ్ బ్యూటీ అవికా గోర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్టు గ్లింప్స్‌ను వదిలారు. కలర్ఫుల్ ఫ్రేమ్స్ లో అవికాను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కాగా.. త్వరలోనే ఈ చిత్ర టైటిల్‌ను వెల్లడించే అవకాశం ఉంది.