'అవతార్ 2' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. అందులోనే మూవీ స్ట్రీమింగ్

అవతార్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 28 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2023 3:15 PM IST
Avatar 2 OTT release,  Avatar Movie

అవతార్ 2 మూవీలోని ఓ దృశ్యం

సినీ ప్రియులను అల‌రించిన చిత్రం 'అవ‌తార్ 2(ది వే ఆఫ్ వాటర్)'. ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన ఈ చిత్రం 2022 డిసెంబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 150కి పైగా బాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. రెండు బిలియ‌న్ డాల‌ర్లకు పైగా వ‌సూలు చేసింది.

ఈ చిత్రం విడుద‌లైన 45 రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తుంద‌ని బావించగా అలా జ‌ర‌గ‌లేదు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి చిత్ర బృందం శుభ‌వార్త చెప్పింది. ఎట్ట‌కేల‌కు దీనిపై ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ నెల (మార్చి) 28 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌కటించింది. మునుపెన్న‌డూ చూడ‌ని విశేషాల‌ను మూడు గంట‌ల పాటు చూసేందుకు సిద్ధం కండి అంటూ అంటూ చిత్ర బృందం ట్వీట్ చేసింది.

ఇక ఈ చిత్ర డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మార్చి 28 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

2009లో విడుద‌లైన "అవ‌తార్" చిత్రానికి కొన‌సాగింపుగా ఈ చిత్రం తెర‌కెక్కింది. తొలి భాగం మొత్తం పండోర గ్ర‌హంలోని సుంద‌ర‌మైన అట‌వీ, జీవ రాశుల ప్ర‌పంచం చుట్టూనే సాగింది. అయితే.. రెండో భాగం ది వే ఆఫ్ వాట‌ర్ అంటూ నీటి ప్ర‌పంచ‌లోకి తీసుకువెళ్లాడు.

Next Story