ఓటీటీలో అవ‌తార్-2 స్ట్రీమింగ్ అప్పుడేనా..?

Avatar 2 The Way Of Water OTT release date.ద‌ర్శ‌కుడు కామెరూన్ అద్భుత సృష్టి 'అవ‌తార్‌'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2022 2:55 PM IST
ఓటీటీలో అవ‌తార్-2 స్ట్రీమింగ్ అప్పుడేనా..?

ద‌ర్శ‌కుడు కామెరూన్ అద్భుత సృష్టి అవ‌తార్‌. గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రేక్ష‌కుల‌ను స‌రికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ చిత్ర రెండో భాగం దాదాపు 13 ఏళ్ల త‌రువాత విడుద‌లైంది. దాదాపు 160 భాష‌ల్లో 2022 డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. విజువ‌ల్ వండ‌ర్ గా ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ కురిపిస్తోంది. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఇప్ప‌టికే 5వేల కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను సాధించినట్లు తెలుస్తోంది.

3D, 4DX టెక్నాల‌జీతో అందుబాటులో ఉన్న అవ‌తార్ 2 సినిమా రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. దీంతో సామాన్యులు ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చిన‌ప్పుడు చూసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి శుభ‌వార్త‌. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను డిస్నీ+హాట్‌స్టార్ భారీ ధ‌ర‌కు సొంతం చేసుకుంది. అయితే విడుద‌ల తేదీపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అయితే.. వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈ చిత్రం విడుద‌లైన 234 రోజుల త‌రువాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంద‌ని అంటున్నారు. ఈ లెక్క‌న మార్చి లేదా ఏప్రిల్ నెల‌లోనే ఓటీటీలో అవ‌తార్‌-2 చూసే అవ‌కాశం ఉంది.

Next Story