'అవ‌తార్ 2'కు భారీ షాక్‌.. విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్‌లో..!

Avatar 2 Full Movie Leaked Online a day before its release. జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2022 7:54 AM IST
అవ‌తార్ 2కు భారీ షాక్‌.. విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్‌లో..!

'టైటానిక్' చిత్రం త‌రువాత హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువ‌ల్ వండ‌ర్ 'అవ‌తార్‌'. 2009లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మ‌రో లోకంలోకి తీసుకువెళ్లింది. ఇక ఈ చిత్ర సీక్వెల్ 'అవతార్ 2' కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఎద‌రుచూస్తున్నారు. అంద‌రి ఎద‌రుచూపుల‌కు తెర‌దించుతూ నేడు(డిసెంబ‌ర్ 16)న విడుద‌ల కానుంది. ఈ సినిమాను 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్ లలో విడుదల చేస్తుండడంతో ఆ స్క్రీన్స్ పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సుమారు 160 బాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ సినిమా టికెట్లు అన్నీ ఇప్ప‌టికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

అయితే.. ఈ చిత్రానికి విడుద‌ల‌కు ముందే భారీ షాక్ త‌గిలింది. ఈ చిత్రం పైర‌సీ బారిన ప‌డింది. ఈ సినిమా థియేట‌ర్ ప్రింట్ సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యింది. ఈ చిత్ర పైర‌సీ కాపీ టెలీగ్రామ్‌లో ఉంద‌ని ప‌లువురు నెటీజ‌న్లు అంటున్నారు. ఈ వార్త చిత్ర బృందాన్ని షాక్‌కు గురి చేస్తోంది. ఎన్నో వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టిన తీసిన సినిమా పైర‌సీ బారిన ప‌డడంతో వ‌సూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

'అవ‌తార్' కోసం ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ సాంకేతికత సాయంతో 'పండోరా' అనే కొత్త ప్ర‌పంచాన్ని సృష్టించాడు. అక్క‌డ నావీ అనే అట‌వీ తెగ నివ‌సిస్తుంటుంది. ప్ర‌కృతే ప్రాణంగా జీవించే వారికి.. అభివృద్ధే ల‌క్ష్యంగా ఉన్న మాన‌వుల‌కు మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే అవ‌తార్‌. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు లవ్ స్టోరీ ఉంటుంది. అవతార్ మొదటి పార్ట్ రన్ టైం రెండు గంటల 42 నిమిషాలకు కాగా రెండో పార్ట్ రన్ టైమ్ మాత్రం మూడు గంటల పది నిమిషాలు ఉండబోతుంద‌ని స‌మాచారం.

Next Story