'అట్టాంటి ఇట్టాంటి' మాస్ బీట్.. ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం సెప్టులు

Attaanti Ittaanti Lyrical song from Nenu Meeku Baga Kavalsinavadini movie.టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2022 1:02 PM IST
అట్టాంటి ఇట్టాంటి మాస్ బీట్.. ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం సెప్టులు

'ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం' లాంటి చిత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ప్రస్తుతం వరుస చిత్రాల‌తో దూసుకువెలుతున్నాడు. 'ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం' ఫేమ్‌ శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కోడి దివ్య ఎంటర్‌టైన్‌ మెంట్స్‌పై కోడి దివ్య దీప్తి నిర్మిస్తోండ‌గా.. సంజనా ఆనంద్, సిద్ధార్థ్‌ మీనా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 9న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. తాజాగా మాస్ బీట్ రిలిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. అట్టాంటి ఇట్టాంటి అంటూ ఈ పాట సాగుతోంది. కాసర్ల శ్యామ్ ర‌చించిన ఈ పాట‌ను సాకేత్, కీర్త‌న శ‌ర్మ ఆల‌పించ‌గా.. స్వ‌ర మాంత్రికుడు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించారు. ఈ పాట‌లో కిర‌ణ్ సెప్టులు ఆ క‌ట్టుకుంటున్నాయి. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

Next Story