విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. క‌రోనాతో నటుడు మృతి

Asuran actor Nitish Veera dies of Covid-19 at 45 in Chennai. త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. అసురన్ నటుడు నితీష్ వీరా కరోనాతో క‌న్నుమూశాడు.

By Medi Samrat  Published on  17 May 2021 3:45 PM IST
విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. క‌రోనాతో నటుడు మృతి

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. అసురన్ నటుడు నితీష్ వీరా కరోనాతో క‌న్నుమూశాడు. క‌రోనా సోకి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నితీష్ ను సోమ‌వారం క‌రోనా మ‌హ‌మ్మారి బలితీసుకుంది. ధనుష్ న‌టించిన అసురన్‌, రజనీకాంత్ న‌టించిన కాలాతో పాటు పుదుపేటై, వెన్నిలా కబాడి కుజు సినిమాల‌లో నితీష్ కీల‌క పాత్ర‌లు పోషించాడు. నితీష్ వ‌యసు 45. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నితీష్ మృతి ప‌ట్ల‌ తమిళ చిత్ర పరిశ్రమ ఆయ‌న‌ కుటుంబానికి సంతాపం తెలిపింది. దర్శకుడు సెల్వరాఘవన్ ధనుష్‌తో నితీష్ క‌లిసి ఉన్న చిత్రాన్ని ట్విట‌ర్ ద్వారా పంచుకున్నారు. హీరో విష్ణు విశాల్ కూడా నితీష్ మృతి ప‌ట్ల త‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశాడు. వెన్నిలా కబాడి కుజు, మ‌వేరాన్ కిట్టు అనే చిత్రాల‌లో క‌లిసి ప‌నిచేశాన‌ని గుర్తుచేసుకున్నాడు. క‌రోనా మ‌హ‌మ్మారి ఎంద‌రో జీవితాల‌ను బలి తీసుకుంది. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరాడు.




Next Story