బిగ్‌బాస్‌ బ్యూటీల ఫోటో వైర‌ల్‌.. వ‌ర్మ నుంచి నేర్చుకున్నా అంటూ

Ashu Reddy kisses Ariyana Glory Waist.సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని అడ్డ‌మైన‌వి అన్ని చూడాల్సి వ‌స్తోంది. కొన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Feb 2022 3:05 PM IST
బిగ్‌బాస్‌ బ్యూటీల ఫోటో వైర‌ల్‌.. వ‌ర్మ నుంచి నేర్చుకున్నా అంటూ

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని అడ్డ‌మైన‌వి అన్ని చూడాల్సి వ‌స్తోంది. కొన్ని మంచివి ఉండ‌గా.. మ‌రికొన్ని చూడ‌లేని చండాలం కూడా ఉంటుంది. హ‌ద్దుల్లో ఉన్నంత వ‌ర‌కు ప‌ర‌వాలేదు గానీ.. అది దాటితే విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ అరియానా గోర్లి, అషు రెడ్డి చేసిన ప‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాగా.. చాలా మంది నెటిజ‌న్లు వాళ్ల‌ని విమ‌ర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. అరియానా గ్లోరీ, అషు రెడ్డి లు ఇటీవ‌ల ఓ టీవీ ఈవెంట్‌కు వెళ్లారు. అక్క‌డ అరియానాతో క‌లిసి అషు ఓ ఫోటో దిగింది. ఆ ఫోటోలో అరియానా న‌డుముపై అషు ముద్దు పెట్టింది. ఈ ఫోటోను అషు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. హద్దులు లేని ఎక్స్‌ప్రెషన్ అనే కామెంట్ పెట్టింది. ఇది చూసిన అరియానా.. 'ఒసేయ్ అషు నీకు, నీ క్రేజీనెస్‌కి దండమే తల్లి. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే.. జడ్జిమెంటల్‌ అవుతున్నాం' అని కామెంట్ పెట్టింది. దీనికి అషు రియాక్ట్ అవుతూ.. 'మంచైనా, చెడైనా ప్రజలెప్పుడూ జడ్జ్‌ చేస్తూనే ఉంటారు. అలా అని మన క్రేజీనెస్‌ని వదిలేయకూడదు. ఎందుకంటే అదే మనల్ని ఇతరుల కన్నా ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ విషయం నేను ఆర్జీవీ నుంచే నేర్చుకున్నా' అని రిప్లై ఇచ్చింది.

ఈ ఫోటో పాటు వారు చేసిన చాటింగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు తమదైన శైలిలో స్పందించారు. ఒకరు ఏంటీ చండాలము అని కామెంట్ చేస్తే.. మరొకరు ఏదో తేడాగా ఉందే అని మరొకరు కామెంట్ పెట్టారు.

Next Story