నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు వర్మ. సమాజంలో ఏ చిన్న ఘటన జరిగినా.. దాని ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. ఎవరు ఎమన్నా సరే.. తనదారి తనదే అన్నట్లు వర్మ ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివారులో జరిగిన దిశ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేయడం ఎన్‌కౌంటర్ చేయడం జరిగిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందించాడు వర్మ. ఈ చిత్రానికి 'ఆశ ఎన్‌కౌంటర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు.
ఈ చిత్రాన్ని నవంబర్ 26 విడుదల చేస్తామని ప్రకటించాడు. ఈ క్రమంలోనే నేడు ట్రైలర్ ను విడుదల చేశాడు. 2 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్‌లో యువతికి ఎదురైన చేధు అనుభవం, ఎన్ కౌంటర్ సంఘటలను చూపించే ప్రయత్నం చేశాడు. అయితే.. ట్రైలర్ ప్రారంభంలో ఈ చిత్రం ఏ వ్యక్తులపైన, ఏ ఏ ఘటనలపైనా ఆధారపడి తీయలేదు కేవలం కల్పితం అని చెబుతూ తన దైన శైలిలో వెళ్లాడు వర్మ. అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సోనియా ఆశ అనే యువతి టైటిల్ రోల్ పోషించిందని వర్మ చెప్పుకొచ్చాడు.