రెహమాన్‌ కుమార్తె ఎంగేజ్‌మెంట్‌

A.R.Rahman daughter Khatija gets engaged.ఏఆర్ రెహమాన్ తన కుమార్తెకు పెళ్లి చేయనున్నారు. రెహమాన్ కుమార్తె ఖతీజా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jan 2022 11:55 AM IST
రెహమాన్‌ కుమార్తె ఎంగేజ్‌మెంట్‌

ఏఆర్ రెహమాన్ తన కుమార్తెకు పెళ్లి చేయనున్నారు. రెహమాన్ కుమార్తె ఖతీజా నిశ్చితార్థం డిసెంబరు 29న ఘనంగా జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిశ్చితార్థం ఫొటోలను ఖతీజా సోషల్ మీడియాలో పంచుకుంది. ఖతీజా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు రియాసిద్దీన్ షేక్ మహ్మద్. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన రియాసిద్దీన్ కూడా సంగీత రంగంతో సంబంధం ఉన్నవాడే. సినీ, వినోద రంగంలో లైవ్ సౌండ్ ఇంజనీర్ గా వ్యవహరిస్తున్నాడు. ఖతీజా గతంలో 'రోబో' చిత్రంలో ఓ పాట కూడా పాడింది.

డిసెంబరు 29న ఖతీజా పుట్టినరోజు కాగా, అదే రోజున నిశ్చితార్థం జరిగింది. ఖతీజా, రియాసిద్దీన్ ల పెళ్లికి ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు. రెహమాన్ కు ఖతీజా, రహీమా అనే కుమార్తెలతో పాటు అమీన్ అనే కుమారుడు కూడా ఉన్నారు.

"With the blessings of the Almighty I'm happy to announce to you all my engagement with Riyasdeen Shaik Mohamed @riyasdeenriyan, an aspiring entrepreneur and a wizkid audio engineer," అంటూ ఖతీజా పోస్టు పెట్టింది. ఆమె ఫోటోను పోస్ట్ చేసిన వెంటనే, వ్యాఖ్యల విభాగంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఖతీజా రెహమాన్ కొన్ని తమిళ చిత్రాలకు తన మధురమైన గాత్రాన్ని అందించింది. ఖతీజా ఇటీవల దుబాయ్ ఎక్స్‌పో 2020లో పాడారు. నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఆమె 16 ఏళ్ల పియానిస్ట్ లిడియన్ నాధస్వరంతో కలిసి 'ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా'లో భాగంగా ప్రదర్శన ఇచ్చింది.

Next Story