హాలీవుడ్ హీరోపై 'రేప్' కేసు
Armie Hammer under investigation for sexual assault.హాలీవుడ్ నటుడు ఆర్మీ హ్యామర్ పై తీవ్ర అభియోగాలను ఓ యువతి మోపింది.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2021 12:21 PM GMTహాలీవుడ్ నటుడు ఆర్మీ హ్యామర్ పై తీవ్ర అభియోగాలను ఓ యువతి మోపింది. తనను చిత్రహింసలకు గురి చేసి మానభంగం చేయడమే కాకుండా 'క్యానిబాలిజం' కూడా చేశాడంటూ ఆరోపణలు చేసింది. దీంతో అతడి సినీ కెరీర్ దాదాపుగా ముగిసిపోవడమే కాకుండా.. ఇప్పటికే అతడి భార్య కూడా విడాకులు ఇచ్చేసింది.
ఆర్మీ హ్యామర్‌తనను శారీరకంగా, మానసికంగా ఎంతో హింసించాడని 24 ఏళ్ల ఎఫీ అనే మహిళ ఆరోపించింది. 2016లో ఫేస్‌బుక్ ద్వారా హ్యూమర్‌ని కలిసానని, అప్పటినుంచి తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిపింది. ఏప్రిల్ 24, 2017న నటుడు ఆర్మీ హ్యూమర్ లాస్‌ఏంజిల్స్‌లో తనపై నాలుగు గంటల పాటు హింసాత్మకంగా అత్యాచారం చేశాడని.. తన తలను పదేపదే గోడకు కొట్టేవాడని సంచలన ఆరోపణలు గుప్పించింది. దీంతో తల, ముఖానికి బలంగా గాయాలయ్యాయని ఆమె తెలిపింది. వీటిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించినట్లు తెలిపింది. ఆ నాలుగు గంటలు తనకు ఏమి జరుగుతుందో కూడా ఊహించలేకపోయానని తెలిపింది. తాను ఖచ్చితంగా చచ్చిబోతున్నానేమోనని అనిపించిందని తెలిపింది. హై ప్రొఫైల్ లాయర్ గ్లోరియా అల్రెడ్ కూడా ఎఫీ పక్కనే ఉంది.
ఎఫీ ఆరోపణల్ని నటుడు ఆర్మీ హ్యూమర్ లాయర్ ఖండించారు. ఎఫీతో పాటు ఇంతకుముందున్న సెక్సువల్ పార్టనర్స్ అందరితోనూ తన రిలేషన్ మ్యూచవల్ అగ్రిమెంట్ ప్రకారమే జరిగాయని.. డేటింగ్‌పై ముందుగానే చర్చించి,ఇరువురి ఏకాభిప్రాయం ఉన్నప్పుడే ముందుకు వెళ్లారని లాయర్ తెలిపాడు. ఇటీవలి కాలంలో ఆర్మీ హ్యూమర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువయ్యాయి. 2020 జూలైలో భార్య ఎలిజబెత్ చాంబర్స్‌తో హ్యూమర్‌కు విడాకులు అయిన సంగతి తెలిసిందే. తనను తాను కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్స్ హ్యామర్‌లో ఉన్నాయని, అందుకే తన నుంచి విడిపోతున్నట్లు అతని భార్య ప్రకటించింది. జనవరి నెలలో కూడా ఆర్మీ హ్యూమర్ చాట్స్ వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఆర్మీ హ్యూమర్ ను పలు ప్రాజెక్టుల నుండి తొలగించేసారు. జెన్నిఫర్ లోపెజ్ షాట్ గన్ వెడ్డింగ్ నుండి తొలగించారు. ఇంకొన్ని సినిమాల నుండి కూడా ఆర్మీ హ్యూమర్ ను తీసేశారు. అతడి సినిమా కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లేనని అంటున్నారు.