ఆస‌క్తిక‌రంగా 'అర్జున ఫల్గుణ' ట్రైలర్

Arjuna Phalguna Trailer out.వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు మ‌రో విభిన్న చిత్రంతో ప్రేక్ష‌కుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2021 8:03 AM GMT
ఆస‌క్తిక‌రంగా అర్జున ఫల్గుణ ట్రైలర్

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు మ‌రో విభిన్న చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. తేజ‌మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'అర్జున ఫాల్గుణ'. చెడుపై మంచి ఎప్పుడూ విజ‌యం సాధిస్తుంద‌నే క‌థాశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు స‌ర‌స‌న అమృతా అయ్య‌ర్ న‌టిస్తోంది. డిసెంబ‌ర్ 31 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

నేడు ఈ చిత్ర థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అత‌డి స్నేహితులు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే అర్థం అవ‌తుంది. కామెడీ స‌న్నివేశాలతో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it