హీరోయిన్‌గా అరియానా..!
Ariyanaglory acts in Raj Tarun movie.బిగ్‌బాస్ సీజన్ 4లో బోల్డ్ యాంకర్‌గా తన అంద చందాలతో అలరించిన అరియానా హీరోయిన్‌గా.
By తోట వంశీ కుమార్ Published on 22 Jan 2021 2:09 PM IST
బిగ్‌బాస్ సీజన్ 4లో బోల్డ్ యాంకర్‌గా తన అంద చందాలతో అలరించడంతో పాటు ముక్కుసూటిగా మాట్లాడుతూ అవతలి వారిని వణికించి ఫైనల్‌కి దూసుకుని వెళ్లింది అరియానా గ్లోరి. విజయానికి ఒక్క అడుగు దూరంగా ఆగిపోయినా అరియానా ప్రేక్షకుల్ని మెప్పించింది. బిగ్‌బాస్ అనంతరం హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించమని అరియానాకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. వీటిపై అరియానా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజాగా అరియానా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో రాజ్ తరుణ్, దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి(సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్)తో దిగిన ఫొటోని షేర్ చేసింది. 'అతి త్వరలో ఎగ్జైటింగ్ వార్త రానుంది. బిగ్ బాస్ తర్వాత నా జీవితంలో ఓ మంచి రోజు. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతూ రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్ ' అని కామెంట్ పెట్టింది. అంతేకాదు.. అన్నపూర్ణ బ్యానర్ ని హ్యాష్ ట్యాగ్‌తో జత చేసింది.
దీన్ని బట్టి చూస్తుంటే.. అన్నపూర్ణ బ్యానర్‌లో రాజ్‌తరుణ్‌తో కలిసి ఓ చిత్రంలో అరియానా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అరియానా హీరోయిన్‌గా నటిస్తోందా..? లేదా కీలక పాత్రలో నటిస్తోందా అన్నది ఆమె చెప్పేవరకు వెయిట్ చేయక తప్పదు.