సాయిధ‌ర‌మ్‌తేజ్ హెల్త్ బులిటెన్ విడుద‌ల‌.. ఇంకా ఐసీయూలోనే

Apollo Doctors says Saidharam Tej health is stable.రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ జూబ్లీహిల్స్‌లోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sept 2021 3:06 PM IST
సాయిధ‌ర‌మ్‌తేజ్ హెల్త్ బులిటెన్ విడుద‌ల‌.. ఇంకా ఐసీయూలోనే

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌సంగ‌తి తెలిసిందే. తాజాగా సోమ‌వారం మ‌ధ్యాహ్నాం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై అపోలో వైద్యులు బులిటెన్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్‌తేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని చెప్పారు. వెంటిలేట‌ర్ అవ‌స‌రం క్ర‌మంగా త‌గ్గుతోంద‌న్నారు. ప్ర‌స్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్న‌ట్లు ఆ బులిటెన్‌లో పేర్కొన్నారు.

ఈ నెల 10న రాత్రి స్పోర్ట్ బైక్ పై ప్ర‌యాణిస్తున్న సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌ప‌డిపోయారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు గాయాలు అయ్యాయి. కాల‌ర్ బోన్ విరిగిన‌ట్లు వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింది. దీంతో నిన్న అపోలో వైద్యులు కాల‌ర్ బోన్‌కు శ‌స్త్ర‌చికిత్స‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story