పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'బ్రో' మూడు రోజుల్లోనే దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి వివాదాలు కూడా వెంటాడుతూ ఉన్నాయి. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించినంతగా రాలేదు. దీంతో ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైరిక్ గా ట్వీట్ చేశారు. 'ప్రొడ్యూసర్ కి కలెక్లన్లు నిల్లు... ప్యాకేజీ స్టార్ కి పాకెట్ ఫుల్లు' అంటూ విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం విడుదలయినప్పటి నుంచి వివాదం నడుస్తూ వస్తోంది. గతంలో అంబటి రాంబాబు డ్యాన్స్ చేయగా.. అవే స్టెప్పులను పోలిన విధంగా ఈ సినిమాలో పృథ్వీ చేత డ్యాన్స్ చేయించారు. ఇది అంబటి రాంబాబుకు నచ్చలేదు.
బ్రో సినిమాపై మరోసారి సెటైర్లు.. పవన్ రెమ్యునరేషన్ పై ఆరోపణలుఇక ఈ సినిమాలో తనను అవమానించేలా శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. తాము కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత తీరుపై కథను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు. నిత్య పెళ్లికొడుకు, పెళ్లిళ్లు - పెటాకులు, తాళి - ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు, మూడు ముళ్లు - ఆరు పెళ్లిళ్లు, మ్రో (మ్యారెజెస్ రిలేషన్స్ అఫెండర్), అయిన పెళ్లిళ్లెన్నో.. పోయిన చెప్పులెన్నో.. అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాజకీయంగా, సినిమాపరంగా ఇక పవన్ నిలిచే అవకాశం లేదని అన్నారు. పవన్ నటించిన కొత్త సినిమా నిర్మాత టీడీపీకి చెందిన ఎన్నారై విశ్వప్రసాద్ అన్నారు. పవన్ కు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా అందించారని ఆరోపించారు. బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి పవన్ కు అందించారని, అమెరికా నుండి పవన్ కు వస్తున్న డబ్బు పెద్ద స్కామ్ అని ఆరోపించారు. పవన్ తన సినిమాకు బ్లాక్ మనీని ఉపయోగిస్తున్నారా? అని ప్రశ్నించారు.