తెనాలి సందీప్.. స‌మంత కోసం ఎవ‌రూ చేయ‌ని ప‌ని చేశాడు..!

AP Fan Builds Temple For Samantha Ruth Prabhu In Bapatla. తమ అభిమాన నటీనటులకు గుడి కట్టి ఆరాధించడం అక్కడక్కడా చూస్తూ ఉంటాం.

By M.S.R  Published on  26 April 2023 8:00 PM IST
తెనాలి సందీప్.. స‌మంత కోసం ఎవ‌రూ చేయ‌ని ప‌ని చేశాడు..!

తమ అభిమాన నటీనటులకు గుడి కట్టి ఆరాధించడం అక్కడక్కడా చూస్తూ ఉంటాం. తాజాగా సమంతపై ఉన్న అభిమానంతో ఆమెకు ఓ అభిమాని గుడి కట్టేశాడు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని. నటిగా ఆమెను ఎంతో ఆరాధించే వాడు సందీప్. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సమంత అంటే అభిమానం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆమెకు గుడి కట్టించాలని అనుకుని.. తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టిస్తున్నాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సమంతను తాను నేరుగా చూడలేదని కానీ, ఆమెపై అభిమానంతో గుడి కట్టిస్తున్నానని చెప్పాడు. ఈ నెల 28న గుడిని ప్రారంభిస్తున్నానని తెలిపాడు.

ఇక సమంత మయోసైటిట్‌ బారిన పడిందని తెలిసి చాలా బాధపడ్డాడు సందీప్‌. సమంత ఆ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని తిరుపతి, చెన్నై, నాగపట్నం మీదుగా మొక్కుబడి యాత్ర కూడా చేశాడు. ఏప్రిల్‌ 28 సమంత పుట్టిన రోజు సందర్భంగా ఈ గుడిని ప్రారంభించాలని అనుకున్నాడు.


Next Story