అంధ‌యువ‌తి విరాళం.. వేరొక‌రి బాధను చూడడానికి నేత్రాలు అవసరం లేదు

AP Blind women donates 15 thousand to sonu sood foundation. తాజాగా ఆ ఫౌండేష‌న్‌కు నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడుకు చెందిన అంధ యువ‌తి బొడ్డు నాగ‌ల‌క్ష్మీ రూ.15 వేల‌ను విరాళంగా ఇచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 13 May 2021 12:08 PM

sonu sood foundation

క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద‌వారితో పాటు, ఆప‌ద‌లో ఉన్న వారికి సాయం చేస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్. త‌న ఫౌండేష‌న్ ద్వారా అడిగిన వారికి లేద‌న‌కుండా.. చాలా త‌క్కువ స‌మ‌యంలో వారికి సాయం అందిస్తున్నాడు. ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడాడు. కాగా సోనూసూద్.. స్థాపించిన ఫౌండేష‌న్‌కు ప‌లువురు దాత‌లు విరాళం ఇస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఆ ఫౌండేష‌న్‌కు నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడుకు చెందిన అంధ యువ‌తి బొడ్డు నాగ‌ల‌క్ష్మీ రూ.15 వేల‌ను విరాళంగా ఇచ్చింది. తాను విరాళంగా ఇచ్చిన రూ.15వేలు నాగ‌ల‌క్ష్మీకి వ‌చ్చిన పెన్ష‌న్ కావ‌డం విశేషం.

ఈ విష‌యాన్ని రియ‌ల్ సోనూసూద్ తెలియ‌జేశాడు. ఓ చిన్న గ్రామానికి చెందిన నాగలక్ష్మి తన ఫౌండేషన్‌కు రూ. 15 వేలు విరాళం పంపిందని, తనవరకు ఈ దేశంలో అత్యంత ధనవంతురాలని ఆమేనని ప్రశంసలు కురిపించాడు. వేరొకరి బాధను చూడడానికి నేత్రాలు అవసరం లేదని పేర్కొన్నాడు. ఆమె నిజమైన హీరో అని ట్వీట్ చేశాడు.




Next Story