పుట్టిన రోజు నాడు సీతాకోక‌చిలుక‌లా మారిన బ్యూటీ

Anupama Parameswaran’s first look from Butterfly movie.అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్.. ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2022 6:47 AM GMT
పుట్టిన రోజు నాడు సీతాకోక‌చిలుక‌లా మారిన బ్యూటీ

అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్.. ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. తాజాగా ఆమె న‌టిస్తున్న చిత్రం 'బటర్‌ ఫ్లై'. నేడు అమ్మ‌డు 25వ ప‌డిలోకి అడుగుపెడుతోంది. ఈ సంద్బంగా చిత్ర బృందం అనుప‌మ‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఫ‌స్టులుక్‌ను విడుద‌ల చేసింది. పోస్ట‌ర్ బ్యాక్ డ్రాప్ లో సీతాకోకచిలుక‌లా క‌ల‌ర్ ఫుల్‌గా డిజైన్ క‌నిపిస్తుండ‌గా అనుప‌మ బాధ‌పడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

ఇక ఈ చిత్రానికి సతీష్ బాబు దర్శకత్వం వ‌హిస్తున్నాడు. కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందించ‌డం విశేషం. లేడి ఓరియెంటెడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి అర్విజ్, గిడియన్ కట్టా సంగీతాన్ని అందిస్తున్నారు. జెన్ నెక్ట్స్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది.

Next Story
Share it