టీచర్‌ జాబ్‌ కొట్టేసిన అనుపమ.. సినిమాల‌కు గుడ్ బై..!

Anupama Parameswaran passes Bihar STET Exam 2019.టెట్‌ పరీక్షలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ మంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2021 8:00 AM GMT
టీచర్‌ జాబ్‌ కొట్టేసిన అనుపమ.. సినిమాల‌కు గుడ్ బై..!

టెట్‌ పరీక్షలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ మంచి మార్కులతో పాసైంది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన మార్కుల ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అదేంటీ..? అనుప‌మ సినిమాకు గుడ్‌బై చెప్ప‌నుందా..? టీచ‌ర్‌గా స్థిర ప‌డాలి అని అనుకుంటుందా అనేగా మీ డౌట్‌. అక్క‌డితోనే మీఆలోచ‌న‌లు ఆపేయండి. ఎందుకంటే అనుప‌మ టీచ‌ర్ కావాల‌ని అనుకుంటుందో లేదో కానీ.. బీహార్ విద్యాశాఖ మాత్రం అనుప‌మ టీచ‌ర్ కావాల‌ని అనుకుంటుంది. అదేంటి అని అంటారా..? అయితే.. మొత్తం చ‌దివేయండి.

ఇటీవ‌ల బిహార్‌ విద్యాశాఖ సెకండరీ టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(STET) ఫలితాలను వెల్లడించింది. ఇందులో రిషికేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి 77 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. కానీ స్కోర్‌ కార్డులో అతడి ఫొటో లేదు. తన ఫొటోకు బదులుగా అనుపమ పరమేశ్వరన్‌ ఫొటో వచ్చింది. దీంతో అత‌డు షాకైయ్యాడు. 'ఇదేమీ మొదటి సారి కాదు. నా అడ్మిట్‌ కార్డు మీద కూడా అనుపమ ఫొటో వచ్చింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని సరిదిద్దుతామని చెప్పారు. కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అదే అడ్మిట్‌ కార్డుతో పరీక్షలు రాశాను. ఇప్పుడు రిజల్ట్స్‌లో కూడా మళ్లీ అనుపమ ఫొటోనే వచ్చింది' అని స‌ద‌రు విద్యార్థి తెలిపాడు.

ఇక చేసేది లేక అత‌డు సోష‌ల్ మీడియాలో రిజ‌ల్ట్ కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటో వైర‌ల్ కావ‌డంతో బీహార్ విద్యాశాఖ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఎట్ట‌కేల‌కు అధికారులు స్పందించారు. ఇలా జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని.. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు.

Next Story
Share it