New Movie: 'పరదా' తొలగించిన అనుపమ
దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండో సినిమాను తెరకెక్కించనున్నారు.
By Srikanth Gundamalla Published on 26 April 2024 9:30 PM ISTNew Movie: 'పరదా' తొలగించిన అనుపమ
కేరళకు చెందిన అనుపమ పరమేశ్వరన్‌కు టాలీవుడ్‌లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె చేసిన క్యారెక్టర్లను జనాలు ఎంతో ఇష్టపడ్డారు. ఇక ఇటీవల తాను ఇన్నాళ్లు చేసిన సినిమాలకు భిన్నంగా కనిపించారు. డీజీ టిల్లు స్క్వేర్‌లో రొమాన్స్ సీన్స్‌లో కనిపించారు. కొందరు దీన్ని రిసీవ్ చేసుకుంటే.. ఇంకొందరు ఎందుకు నీకు ఇది అంటూ కామెంట్ చేశారు. అయితే.. తాజాగా అనుపమ పరమేశ్వరన్ మరో సినిమా మొదలైంది.
దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండో సినిమాను తెరకెక్కించనున్నారు. అనుపమ పరమేశ్వర్, వెర్సటైల్ దర్శనా రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మహిళా కథానాయకుల చుట్టు తిరిగే కథతో ఈ 'పరదా' సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. సమంత, రాజ్ అండ్ డీకే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను లాంచ్ చేశారు.
పరదా సినిమా నుంచి విడుదలైన కాన్సెప్ట్ వీడియో, ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో, వోనీతో తన ముఖాన్ని కంపి ఉంచి మరింకొందరు అమ్మాయిలతో పాటు అనుపమ ఉంటుంది. విలేజ్ సెటప్‌లో దేవత విగ్రహాన్ని మొదటగా చూపించారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రఫల క్రియా, మనుస్మృతి లోని ప్రసిద్థ శ్లోకం వినబడుతుంది. మొదట అనుపమ మొఖానికి పరదా కప్పుకుని కనిపిస్తుంది. తర్వాత దానిని మెల్లిగా తొలగిస్తూ టైటిల్ రివీల్ చేశారు. ఇందులో అనుపమ నేచురల్ లుక్‌లో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ టీజర్‌కు నెట్టింట విశేష స్పందన లభిస్తుంది. దర్శన రాజేంద్రన ఈ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ చేశారు. మేలో హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తోంది.