ఆక‌ట్టుకుంటున్న 'అనుభ‌వించు రాజా' టీజ‌ర్‌

Anubhavinchu Raja teaser out.హీరో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న తాజా చిత్రం అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sept 2021 10:57 AM IST
ఆక‌ట్టుకుంటున్న అనుభ‌వించు రాజా టీజ‌ర్‌

హీరో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'అనుభవించు రాజా'. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న కషికా ఖాన్‌ నటిస్తోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, శ్రీవెంట‌క‌టేశ్వ‌ర సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ విడుద‌ల చేశారు.

గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ని టీజర్‌ చూస్తే అర్థమవుతంది. కోడి పందాలు ఆడే వ్యక్తిగా రాజ్‌త‌రుణ్ కనించబోతున్నాడు. బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉండగా ఇంకోకడు గెలవడం కష్టమే'అంటూ రాజ్‌ తరుణ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్‌ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్‌ వంశీ, త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Next Story