ఆక‌ట్టుకుంటున్న 'అంటే సుంద‌రానికి' టీజ‌ర్‌

Ante Sundaraniki Movie Teaser out.నేచురల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2022 12:18 PM IST
ఆక‌ట్టుకుంటున్న అంటే సుంద‌రానికి టీజ‌ర్‌

నేచురల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న మ‌ల‌యాళ భామ నజ్రియా న‌టిస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ, కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. అందులో భాగంగా నేడు ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.

సాంప్రదాయ ఆచారాల కారణంగా కుటుంబం నుండి అనేక అభ్యంతరాలు, జీవితంలో అడ్డంకులు ఉన్న సాధారణ బ్రాహ్మణుడిగా నాని టీజర్‌లో అదరగొట్టేశాడు. క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌జ్రియా న‌టిస్తోండ‌గా.. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. మీకింకా అస‌లు విష‌యం చెప్ప‌లేదంటూ నాని న‌వ్వులు పూయిస్తూ.. సెల‌బ్రెట్ ది మ్యాడ్‌నెస్ ఆఫ్ లవ్‌, లాఫ్ట‌ర్ అండ్ ఫ్యామిలీ అంటూ చెప్పే డైలాగ్‌లు సినిమాపై అంచనాల‌ను పెంచుతున్నాయి. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.

నరేష్, రోహిణి, నదియా, హర్ష తదితరులు కీలక పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం బాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Next Story