సల్మాన్ ఖాన్ తండ్రిని అలా బెదిరించేశారా.?

జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరును ఉపయోగించి నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, రచయిత సలీం ఖాన్‌ ను బురఖా ధరించిన మహిళ బెదిరించింది

By Medi Samrat  Published on  19 Sept 2024 9:30 PM IST
సల్మాన్ ఖాన్ తండ్రిని అలా బెదిరించేశారా.?

జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరును ఉపయోగించి నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, రచయిత సలీం ఖాన్‌ ను బురఖా ధరించిన మహిళ బెదిరించింది. లారెన్స్ బిష్ణోయ్ సూచన మేరకు సల్మాన్ ఖాన్ బాంద్రా ఇంటిపై కొద్దిరోజుల కిందట ఒక ముఠా కాల్పులు జరిపింది. బుధవారం నాడు ముంబైలోని కార్టర్ రోడ్ వద్ద సలీం ఖాన్‌ను బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి, మహిళ బెదిరించారు. బాంద్రా పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి కోసం వేట మొదలుపెట్టారు. ఆ మహిళ సలీం ఖాన్‌ దగ్గరకు వచ్చి "లారెన్స్ బిష్ణోయ్ కో బులావూ క్యా (లారెన్స్ బిష్ణోయ్ ని పిలవమంటావా?)" అని వ్యాఖ్యలు చేసింది.

రెండు వేర్వేరు సంఘటనలలో నటుడు సల్మాన్ ఖాన్, అతని కుటుంబం ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక సంఘటనలో బుధవారం ఉదయం ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన యువకుడు తన ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడిపాడు. అదే రోజు సలీం ఖాన్‌ను బురఖా ధరించిన మహిళ బెదిరించింది.

ఈ రెండు ఘటనలు వేర్వేరు సమయాల్లో జరిగాయని, రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. విచారణలో వారికి ఏ ముఠాలతోనూ సంబంధం లేదని తేలిందన్నారు. ర్యాపర్ సిద్ధు మూసేవాలా హత్యకేసులో ప్రమేయం ఉన్న గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన సంగతి తెలిసిందే. నటుడు సల్మాన్ ఖాన్‌కు Y+ కేటగిరీ భద్రత ఉంది. సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా అతని వాహనాన్ని భద్రతా సిబ్బంది, కమాండోల కాన్వాయ్ చుట్టుముడుతుంది.

Next Story