శంకర్-రణవీర్ సింగ్.. అపరిచితుడు రీమేక్ కన్ఫర్మ్ అయింది..!

'Anniyan' Hindi remake: Shankar, Ranveer Singh join hands. అన్నియన్.. అదేనండీ అపరిచితుడు సినిమాను బాలీవుడ్ లో రూపొందించాలని అనుకుంటున్నారు.

By Medi Samrat
Published on : 14 April 2021 12:57 PM IST

Anniyan remake

అన్నియన్.. అదేనండీ అపరిచితుడు సినిమా.. విక్రమ్ తన నటనతో మనందరినీ మెప్పించాడు. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో రూపొందించాలని అనుకుంటున్నారు. అయితే పూర్తిగా అపరిచితుడు రీమేక్ అయ్యింటుందా..? లేక స్ప్లిట్ పెర్సనాలిటీ డిజార్డర్ మీద అయ్యుంటుందా అన్నాదానిలో క్లారిటీ రావాలి.

ప్రస్తుతానికైతే శంకర్-రణవీర్ సింగ్ కాంబినేషన్ లో సినిమా అయితే రూపొందబోతోందనే అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది. తమ కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే విష‌యాన్ని అధికారికంగా శంకర్, రణవీర్ సింగ్ ప్ర‌క‌టించారు. శంక‌ర్‌తోపాటు ప్రొడ్యూస‌ర్ జ‌యంతిలాల్‌తో క‌లిసి ఉన్న ఫొటోను ర‌ణ్‌వీర్ ఈ సంద‌ర్భంగా షేర్ చేశాడు. ఇండియ‌న్ సినిమా మార్గ‌ద‌ర్శ‌కుడితో చేతులు క‌లుపుతున్నాన‌ని ప్ర‌క‌టిస్తున్నందుకు చాలా గ‌ర్వంగా ఉందని.. అద్భుత‌మైన సినిమాటిక్ విజ‌న్ ఉన్న శంక‌ర్ స‌ర్‌తో మూవీ చేస్తుండ‌టం త‌న అదృష్ట‌మ‌ని ఈ సంద‌ర్భంగా ర‌ణ్‌వీర్ అన్నాడు. ఎప్ప‌టికైనా ఆయ‌న‌తో మూవీ చేయాల‌ని తాను భావించేవాడిన‌ని, ఇప్పుడు త‌న క‌ల నిజ‌మైన‌‌ట్లేనని రణవీర్ చెప్పుకొచ్చాడు.

ఇక సినిమా పూర్తిగా అన్నియన్ రీమేక్ అయితే మాత్రం సౌత్ ఆడియన్స్ తప్పకుండా అప్సెట్ అవుతారు. అదే థీమ్ తీసుకుని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక విక్రమ్ స్థాయిలో రణవీర్ నటించి.. మెప్పిస్తాడా అని కూడా మాట్లాడేసుకుంటూ ఉన్నారు.


Next Story