అంకితాను కాంప్రమైజ్ అవ్వమని అడిగారట!
క్యాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి అంకితా లోఖండే
By Medi SamratPublished on : 1 March 2024 6:46 PM IST

క్యాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి అంకితా లోఖండే టెలివిజన్ షో 'పవిత్ర రిస్తా'తో మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తన కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని.. ఒకవేళ తన జీవితంలో అలాంటిది జరిగి ఉండకపోతే తప్పకుండా సినిమాల్లో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించి ఉండేదని తెలిపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అంకిత మాట్లాడుతూ.. ఒక చిత్ర నిర్మాతతో తనకు ఎదురైన అనుభవం గురించి వివరించింది. తనతో పడుకోవడానికి అంగీకరిస్తేనే సినిమాల్లో నటించేందుకు అవకాశం ఇస్తానని అతడు ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చింది.
అంకితా ముంబై హోటల్‌లో ఒక చిత్రనిర్మాతని కలవడానికి వెళ్ళింది. సినిమాలో ఒక పాత్రకు ఎంపికయ్యావని కూడా ఆమెతో చెప్పాడట. నేను సినిమాలో నటించడానికి సంతకం చేయడానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ విషయం మా అమ్మతో కూడా పంచుకున్నానని వివరించింది అంకిత. తీరా హోటల్‌కి వెళ్లినప్పుడు.. నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని అడిగారు. అప్పట్లో నాకు 19 ఏళ్లు. 'ఏ విధమైన కాంప్రమైజ్?' అని ఎదురు ప్రశ్నించానని తెలిపింది. "మీరు నిర్మాతతో పడుకోవాలి." అని అక్కడ ఉన్న వ్యక్తి చెప్పగానే నేను లేచి వచ్చేశానని చెప్పుకొచ్చింది. “మీ ప్రొడ్యూసర్‌కి టాలెంట్ అవసరమని నేను అనుకోను, వాళ్లతో పడుకోవడానికి అమ్మాయి కావాలి, నేను అలాంటి దాన్ని కాను” అని చెప్పేసి అక్కడి నుండి వచ్చేశానని వివరించింది అంకిత. ఆ తర్వాత టెలివిజన్ ఇండస్ట్రీలో అంకిత బాగా బిజీ అయిపోయింది. అంకిత బాలీవుడ్‌లో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీలో నటించింది. ఆమె బాఘీ 3లో కూడా నటించింది. త్వరలో స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలో కనిపించనుంది.
Next Story