'యానిమల్‌' మూవీ ఫస్ట్‌ సింగిల్‌పై నెటిజన్ల విమర్శలు

రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్న నటిస్తోన్న 'యానిమల్‌' మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌ సింగిల్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  11 Oct 2023 12:54 PM IST
Animal Movie, first single, ammayi song, controversy,

 'యానిమల్‌' మూవీ ఫస్ట్‌ సింగిల్‌పై నెటిజన్ల విమర్శలు

రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్నా నటిస్తోన్న 'యానిమల్‌' మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. దీంట్లో రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌లు మామూలుగా లేవు. కొన్ని నిమిషాలే ఉన్న ఈ ఫస్ట్‌ సింగిల్‌లో చాలా ముద్దు సీన్లు పెట్టేశారు. అయితే.. తండ్రీ కొడుకుల అనుంబంధం నేపథ్యంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది ఈ యానిమల్‌ మూవీ. అర్జున్‌రెడ్డి సినిమా ఫేమ్‌ సందీప్‌ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం రిలీజ్‌ అయిన అమ్మాయి అనే పాటలో రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. లిప్‌లాక్‌తో మొదలైన ఈ పాటపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

ఏం.. గీత ఇలాంటిదేదైనా ఉంటే ముందే చెప్పిలిగా.. ఇంత దూరం తీసుకొచ్చావు.. అ అబ్బాయిని చిన్నప్పట్నుంచి చూస్తున్నాం.. ఏ చేశాడో చూడండి అంటూ రణ్‌బీర్‌పై రష్మిక మందన్న ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చూపించారు. ర‌ణ్‌భీర్‌ను ఇంట్లో నుంచి గెంటేయ‌డానికి ర‌ష్మిక ఫ్యామిలీ ట్రై చేయ‌డం, వారి ప్లాన్స్‌ను అడ్డుకోవ‌డానికి ఇద్ద‌రు లిప్‌లాక్ పెట్టుకుంటున్న‌ట్లుగా చూపిస్తూ పాట‌ను మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత ఫ్లైట్ జ‌ర్నీలో ర‌ష్మిక , ర‌ణ్‌భీర్ ముద్దుల్లో మునిగిపోయిన‌ట్లుగా చూపించారు. అయితే.. ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లుగా చూపించి అమ్మాయి పాటను పూర్తి చేశారు.

ఈ ఫస్ట్‌ సింగిల్‌కు రణ్‌బీర్‌, రష్మిక కెమిస్ట్రీ అదిరిపోయిందని కొందరు కామెంట్స్‌ చేస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు.లిరిక్స్‌.. మ్యూజిక్‌ కంటే లిప్‌లాక్‌లే హైలైట్‌ అయ్యాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పాట చూస్తుంటే యానిమల్‌ మూవీ అర్జున్‌రెడ్డికి మరో వెర్షన్‌లా ఉందంటున్నారు. ఇన్ని లిప్‌లాక్‌లు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా.. యానిమల్‌ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అనిల్‌ కపూర్, బాబీ డియోల్‌ ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు.

Next Story