బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 : ఎలిమినేష‌న్‌లో ఊహించ‌ని ట్విస్ట్‌

Anchor Ravi eliminated from Bigg Boss 5 Telugu.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలుకాగా..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Nov 2021 5:05 AM GMT
బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 : ఎలిమినేష‌న్‌లో ఊహించ‌ని ట్విస్ట్‌

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలుకాగా.. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ప్ర‌తి వారం ఎవ‌రో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుండ‌గా.. ఈ రోజు ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. ఈ 12వ వారం నామినేష‌న‌ల్‌లో మాన‌స్ మిన‌హా.. మిగిలిన ఏడుగురు ఇంటి స‌భ్యులు ఉన్నారు. వీరిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ప‌రంగా ష‌ణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, ర‌వీ ఈజీగా ఎలిమినేష‌న్ గండం నుంచి గ‌డ్డెక్కుతార‌ని అంతా బావించారు.

ప్రస్తుతం నామినేట్ అయిన సభ్యులలో ప్రియాంక, సిరి, కాజల్ డేంజర్ జోన్‏లో ఉన్నారని.. వీరిలో తక్కువ ఓట్లు ప్రియాంకకు రావడంతో ఆమెనే ఈ వారం ఎలిమినేట్ కానుంద‌నే టాక్ వినిపించింది. అయితే.. బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడంట‌. త‌ప్ప‌కుండా టాప్ 5 లో ఉంటాడ‌ని బావిస్తున్న యాంక‌ర్ ర‌విని ఇంటిని నుంచి బ‌య‌ట‌కు పంపించి వేశాడ‌ట‌. చివ‌రి వ‌ర‌కు ర‌విని మ‌రో కంటెస్టెంట్‌తో ఉంచి చివ‌రికి.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా యాంక‌ర్ ర‌విని ఎలిమినేట్ చేశాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త విని ర‌వి అభిమానులు షాక్‌కు గుర‌వుతున్నారు. ప్రియాంక‌, కాజ‌ల్‌, సిరి కంటే త‌క్కువగా ర‌వికి ఓట్లు రావ‌డం న‌మ్మ‌శ‌క్యంగా లేదంటున్నారు. చూడాలీ మ‌రీ నిజంగానే ర‌వి ఎలిమినేట్ అయ్యాడా..? లేదా అన్న‌ది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Next Story