పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్.. ఏమన్నాడంటే..?
Anchor Pradeep responded to the marriage rumours.బుల్లితెరపై తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ
By తోట వంశీ కుమార్ Published on 28 Dec 2022 1:54 PM ISTప్రదీప్ మాచిరాజ్.. పరిచయం చేయాల్సిన పని లేదు. బుల్లితెరపై తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వారి హృదయాల్లో చెదరని ముద్ర వేశాడు. ప్రేక్షకులు కూడా ప్రదీప్‌ను తమ కుటుంబంలోని ఓ సభ్యుడిగా బావిస్తుంటారు. ఇక ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొంతకాలంగా ఎన్నో సార్లు వార్తలు వినిపించాయి. అయితే.. వాటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అవి నిజం కాదంటూ చెప్పేవాడు ప్రదీప్.
పెళ్లి వయస్సు దాటిపోతుండడంతో ఇంకెప్పుడు ప్రదీప్ వివాహం చేసుకుంటాడోనని అతడి అభిమానులు ఎదురుచూస్తుండగా.. ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రదీప్ ఏడు అడుగులు వేయనున్నాడు అని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఎప్పటికప్పుడు పెళ్లి వార్తలపై స్పందించే ప్రదీప్ ఈ సారి స్పందించకపోవడంతో నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాడని చాలా మంది బావించారు. అయితే.. ఈ సారి కూడా అవన్నీ పుకార్లనే తేలాయి.
తాను షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ఆలస్యంగా స్పందిస్తున్నట్లు ప్రదీప్ చెప్పాడు. ఆ అమ్మాయికి తనకి ఎలాంటి సంబంధం లేదన్నాడు. ప్రొఫెషన్ పరంగా మా టీమ్ వాళ్లు ఆమెతో మాట్లాడి ఉంటారని అన్నాడు. అయితే.. ఇంత వరకు ఆమెతో తాను మాట్లాడలేదని ప్రదీప్ చెప్పారు. అనవసరంగా తన పేరును లాగకండి. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. సింగిల్‌గానే ఉన్నా. ఇప్పుడిప్పుడే నా కుటుంబం తండ్రిని కోల్పోయిన బాధలోంచి కోలుకుంటుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా టీవీ షోలు, సినిమాలపైనే ఉంది. ప్రస్తుతం రెండో చిత్రంలో నటిస్తున్నా. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది అని ప్రదీప్ చెప్పాడు.