యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ఇంట్లో విషాదం

Anchor Pradeep machiraju father passed away.ప్ర‌దీప్ మాచిరాజు ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి పాండు రంగ క‌న్నుమూశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2021 11:04 AM IST
Anchor Pradeep Machiraju

బుల్లితెరపై తిరుగులేని రారాజు ప్రదీప్ మాచిరాజు. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే ప్రదీప్ ఇప్పుడు తీరని దు:ఖంలోకి జారిపోయారు. ఇటీవల సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చి వెండితెర, బుల్లితెరపై బిజీ అయిన ఆర్టిస్టుగా ప్రదీప్ మారాడు. త్వరలోనే కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్న వేళ అనుకోని విషాదం ఆవహించింది.

ప్ర‌దీప్ మాచిరాజు ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి పాండు రంగ క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. శ‌నివారం సాయంత్రం ప్ర‌దీప్ తండ్రి ఆరోగ్యం విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచారు. మరోవైపు ప్రదీప్‌ కూడా కోవిడ్‌ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే ప్రదీప్‌ తండ్రి కోవిడ్‌ వల్ల చనిపోయారా లేదంటే ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారన్నది కూడా తెలియాల్సి ఉంది.

యాంక‌ర్‌గా బుల్లి తెర‌పై తిరుగులేని ప్ర‌దీప్‌.. 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా సినిమాతో హీరోగా వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నిర్మాత‌ల‌కు లాభాల్ని తెచ్చిపెట్టింది. ఆ త‌ర‌వాత హీరోగా ప‌లు అవ‌కాశాలు వ‌చ్చినా.. ప్ర‌దీప్ అంగీక‌రించ‌లేదు. త్వ‌ర‌లోనే ఓ కొత్త ప్రాజెక్టుని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారాయ‌న‌. ఇంత‌లోనే.. త‌న ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.


Next Story