ప్ర‌ముఖ యాంక‌ర్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్‌

Anchor Gayatri Bhargavi Facebook Account Hacked.సోష‌ల్ మీడియా అందుబాటులోకి రావ‌డంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2021 7:56 AM GMT
ప్ర‌ముఖ యాంక‌ర్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్‌

సోష‌ల్ మీడియా అందుబాటులోకి రావ‌డంతో రాజ‌కీయ‌నాయ‌కులు, సినీ సెల‌బ్రెటీలు అంద‌రూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. త‌మ‌కు సంబంధించిన ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెన‌ల్ విషయాల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. కొన్ని సార్లు వీరి ఖాతాలు హ్యాక్ అవుతున్నాయి. అలా వీరి అకౌంట్ల‌లోంచి త‌ప్పుడు సందేశాలు, పోస్టులు పెడుతున్న ఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్ర‌ముఖ టీవీ యాంక‌ర్, న‌టి గాయత్రి భార్గ‌వి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయింది.

గాయ‌త్రికి ఫేస్‌బుక్‌లో ప‌ర్స‌న‌ల్ అకౌంట్‌తో పాటు ఆమె పేరు మీద ఓ పేజీ ఉంద‌ట‌. ఈ రెండింటిని హ్యాక్ చేయ‌డంతో బుధ‌వారం హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను గాయ‌త్రి భార్గ‌వి ఆశ్ర‌యించారు. ఏసీపీ కె.వి.ఎం.ప్ర‌సాద్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గాయ‌త్రి భార్గ‌వికి ఫేస్‌బుక్‌లో ఖాతాతో పాటు ప్ర‌త్యేకంగా పేజీ ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవ‌ల త‌న ఫేస్‌బుక్‌, పేజ్‌ల‌ను హ్యాక్ చేయ‌డంతో పాటు వివిధ మ‌తాల‌కు సంబంధించిన అభ్యంత‌ర‌క‌ర‌మైన సందేశాల‌ను అందులో ఉంచుతున్నార‌ని తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

గతంలో కూడా చాలా మంది ఫేస్ బుక్ అకౌంట్స్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. సింగర్ స్మిత, న‌టి ఖుష్భూ అకౌంట్ కూడా ఇలానే హ్యాక్ అయ్యింది. కాగా.. అకౌంట్లు హ్యాకింగ్ బారి నుంచి త‌ప్పించుకోవాలంటే.. త‌ర‌చూ త‌మ పాస్‌వ‌ర్డ్స్ మారుస్తూ ఉండాలి. అలాగే ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో ఉండే వైపైల‌ని అస్స‌లు వాడ‌కూడ‌దు .

Next Story