అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం.. 'హ్యాపీ పూల్స్ డే' అంటూ అన‌సూయ ట్వీట్‌

Anchor Anasuya tweet happy fools day.ఈ రోజు( మార్చి 8) అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం అన్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2022 2:15 PM IST
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం.. హ్యాపీ పూల్స్ డే అంటూ అన‌సూయ ట్వీట్‌

ఈ రోజు( మార్చి 8) అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌ల త్యాగాల‌ను, త‌మ విజ‌యానికి మ‌హిళ‌లు అందించిన తోడ్పాటును తెలియ‌జేస్తూ వారికి అభినంద‌న‌లు తెలుపుతూ.. సినీ ప్ర‌ముఖుల‌తో పాటు సామాన్యులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో యాంక‌ర్ అన‌సూయ చేసిన ఓ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమె చేసిన ట్వీట్‌ను కొంద‌రు స‌మ‌ర్థిస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం విమ‌ర్శిస్తున్నారు.

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా యాంక‌ర్ అన‌సూయ కొంచెంద సెటైరిటిక‌ల్ ట్వీట్ చేసింది. ఈ రోజు మాత్ర‌మే మ‌హిళ‌ల‌ను గౌరవిస్తార‌ని తెలిపింది. ట్రోల‌ర్లు, మీమ్స్ చేసేవారు ఆక‌స్మాత్తుగా స్త్రీల‌ను గౌర‌వించ‌డం ప్రారంభించారు. ఈ గౌర‌వం మ‌రో 24 గంట్ల‌లో ముగుస్తుందని చెప్పింది. మ‌ళ్లీ ఎప్ప‌టిలాగే వారు ప్ర‌వ‌ర్తిస్తుంటారని.. అందుక‌నే మ‌హిళ‌లు అంద‌రూ దూరంగా ఉండాల‌ని సూచించింది. హ్యాపీ పూల్స్ డే అంటూ అన‌సూయ రాసుకొచ్చింది.

'ఓహ్‌.. సడెన్ గా ఈరోజు ప్రతి ట్రోలర్ మరియు మీమ్ మేకర్ మహిళలను గౌరవించడం ప్రారంభించేస్తున్నారు. ఇది కేవలం ఈ 24 గంటల్లో ముగిసిపోతుందన్న విషయం తెల్సిందే.. అందుకే మహిళలు దూరంగా ఉండండి.. హ్యాపీ ఫూల్స్ డే' అంటూ అన‌సూయ ట్వీట్ చేసింది.

అన‌సూయ చేసిన ట్వీట్ ప‌ట్ల కొంద‌రు సానుకూలంగా స్పందిస్తూ రిప్లై ఇస్తుండ‌గా.. మ‌రి కొంద‌రు ఆమెను విమ‌ర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story