తమిళ ప్రేక్షకుల ముందుకు రంగమ్మత్త

Anchor anasuya tamil movie ... తెలుగు ప్రేక్ష‌కుల‌కు అన‌సూయ‌ను ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా మంచి పేరు తెచ్చు

By సుభాష్  Published on  5 Dec 2020 7:59 AM GMT
తమిళ ప్రేక్షకుల ముందుకు రంగమ్మత్త

తెలుగు ప్రేక్ష‌కుల‌కు అన‌సూయ‌ను ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా మంచి పేరు తెచ్చుకోవ‌డంతో పాటు రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమాలో న‌టించి.. రంగ‌మ్మ‌త్త‌గా అంద‌రి హృద‌యాల్లో చెద‌ర‌గ‌ని ముద్ర వేసింది. ప్రస్తుతం ఈమె కృష్ణ వంశీ రంగమార్తండ సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు రవితేజ హీరోగా రూపొందుతున్న ఖిలాడీ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. అన‌సూయ తమిళ ప్రేక్షకుల ముందుకు కూడా వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అమ్మడు తమిళ్‌లో తన మొదటి సినిమాకు ఓకే చెప్పిందట. విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ పాత్ర కాస్త బోల్డ్ గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి అను ఓ ఫొటోను షేర్ చేసింది. దానితోపాటు మరో మంచి కథతో కొత్త ప్రయాణం అంటూ రాసుకొచ్చింది. దీనికి నటి సిల్స్ స్మితా రిఫరెన్స్ అని తెలిపింది. ఈ సినిమాలో అనసూయా సిల్క్ స్మితా పాత్ర చేస్తుందని, అందుకే అలా ఇండైరెక్ట్‌గా చెప్పిందని ఆమె అభిమానులు అంటున్నారు. సిల్క్ పాత్రలో అనసూయ నటించడం అంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ రోల్ అనడంలో సందేహం లేదు. అలాంటి పాత్రను అనసూయ ఎలా చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

తమిళంలో మొదటి సినిమాతోనే ఒక ఛాలెంజింగ్ రోల్ ను చేయడం ద్వారా ఈమె మరింతగా తమిళ ఆడియన్స్ కు చేరు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తమిళ ఆడియన్స్ ను మెప్పించగలిగితే ఈమెకు అక్కడ హీరోయిన్ గా ఆఫర్లు కూడా వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it