ర‌వితేజ 'ఖిలాడి' చిత్రంలో అనసూయ.. గేమ్ ఛేంజ‌ర్ అట‌

Anchor Anasuya plays key role in Ravi teja Khiladi movie.వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2021 12:05 PM IST
Anchor Anasuya plays key role in Ravi teja Khiladi movie

వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ 'క్రాక్' చిత్రంతో స‌క్సెస్ బాట ప‌ట్టాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'ఖిలాడి'. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. స‌స్పెన్స్ యాక్ష‌న్ ఎంటైర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర‌లో ర‌వితేజ డ‌బుల్ రోల్‌లో న‌టిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండ‌గా.. మే 28న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటిస్తున్నసంగ‌తి తెలిసిందే.

ఇద‌లా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఓ కీల‌క పాత్ర చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్ల‌డించింది. ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌.. సోషల్ మీడియా వేదికగా ఆమె ఫొటోను షేర్ చేస్తూ.. వెల్‌కం చెప్పారు. ఆమె చేసేది ఏ పాత్ర అనే దానిపై వివరణ ఇవ్వలేదు కానీ.. ఇందులో అనసూయ రోల్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందన్నారు.


ఇక అన‌సూయ బుల్లితెర‌పై యాంక‌ర్‌గా కొన‌సాగుతూనే వెండితెర‌పై వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తోంది. 'రంగ‌స్థ‌లం'లో రంగ‌మ్మ‌త‌గా ఆమె న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఏ పాత్ర‌ ప‌డితే అది చేయ‌కుండా.. న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌కే అన‌సూయ ఓకే చెబుతుండ‌డంతో.. 'ఖిలాడీ' చిత్రంలో పాత్రతో అన‌సూయ మ‌రోసారి ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు అన‌సూయ 'థ్యాంకు బ్ర‌ద‌ర్' అనే చిత్రంలో న‌టిస్తోంది. గ‌ర్భిణిగా పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story