'పుష్ప' నుంచి అనసూయ లుక్ లీక్.. షాక్‌లో అభిమానులు..!

Anasuya Look Pushpa movie leaked.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2021 8:48 AM IST
పుష్ప నుంచి అనసూయ లుక్ లీక్.. షాక్‌లో అభిమానులు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప‌'. శ‌ర‌వేగంగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది. యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడిగా ర‌ష్మిక న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా పుష్ప సెట్ లోని ఆమె ఫోటోలు లీక్ అయ్యాయి. ఇదివరకు సుకుమార్ 'రంగస్థలం'లో అనసూయ గెటప్ ఆకట్టుకోగా.. ఈ సినిమాలోను భిన్నమైన గెటప్ లో అనసూయ సెట్స్ మీద కనిపించిన ఫొటోలు వైరల్ గా మారాయి. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో న్యూ లుక్ లో కనిపిస్తున్న అనసూయ.. నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని ఒంటి నిండా నగలు ధరించి ఉంది. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ పిక్ లో కనిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం అన‌సూయ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు అన‌సూయ గెట‌ప్‌పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈమె అసలు అనసూయేనా అంటూ నెటిజన్లు క్రియేట్‌ చేసిన మీమ్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇందులో సునీల్ భార్యగా అనసూయ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇటీవలె ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story