అనసూయ ఫొటోతో పోస్టల్ స్టాంప్.. సోషల్ మీడియాలో వైరల్
Anasuya Bharadwaj postal stamp pic viral.తెలంగాణ చిత్రపురి చలనచిత్రోత్సవం అంధాల భామ అనసూయను గౌరవిస్తూ.. ఆమె ఫోటోతో ఉన్న పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది.
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2021 7:56 AM GMT
బుల్లితెరపై యాంకర్‌గానే కాకుండా వెండితెరపై నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. తన వృత్తికి సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తనకు దక్కిన అద్భుత గౌరవానికి ఉప్పొంగిపోతూ ఓ పోస్ట్ పెట్టింది. దీన్ని చూసిన అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారనే చెప్పారు.
తెలంగాణ చిత్రపురి చలనచిత్రోత్సవం అంధాల భామ అనసూయను గౌరవిస్తూ.. ఆమె ఫోటోతో ఉన్న పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. ఈ సందర్భంగా అనసూయ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి అద్భుతమైన గౌరవం తనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. చిత్రపురి వాసులకు ఎల్లవేళలా అండగా ఉంటానంటూ వాగ్ధానం చేసింది. జీవితంలో ఇలాంటి గౌరవం దక్కడం కన్నా మించినది ఏముంది అని పేర్కొంది అనసూయ.
జీవితంలో ఇంతకు మించిన అపారమైన గౌరవం ఏం ఉంటుంది . నేను ఏం చేశానో తెలియదు. నాకు ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉంది. నన్ను ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నమిది. మీరు చేస్తున్న గొప్ప పనుల కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ అనసూయ సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. ప్రస్తుతం అనసూయ.. రంగమార్తాండ, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్ చిత్రాల్లో నటిస్తుంది.