పుష్ప‌: దాక్షాయణిగా అనసూయ లుక్ విడుద‌ల‌.. గుర్తే ప‌ట్ట‌లేదుగా

Anasuya as Dakshayani in Pushpa movie.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Nov 2021 10:51 AM IST
పుష్ప‌: దాక్షాయణిగా అనసూయ లుక్ విడుద‌ల‌.. గుర్తే ప‌ట్ట‌లేదుగా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'పుష్ప‌'. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌ధ్యంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాసిల్‌, సునీల్‌తో పాటు అందాల భామ యాంక‌ర్ అన‌సూయ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో అన‌సూయ దాక్షాయ‌ణి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. తాజాగా ఈ పాత్ర‌కు సంబంధించిన అన‌సూయ లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

దాక్షాయణినికి అహంకారంతో పాటు గ‌ర్వం ఉంటుంద‌ని తెలుపుతూ చిత్ర బృందం అన‌సూయ లుక్‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది. ఆ లుక్‌ను చూస్తుంటే.. అన‌సూయ పాత్ర చాలా నెగెటివిటీతో ఉంటుంద‌ని తెలుస్తుంది. దాక్షాయ‌ణి లుక్ ఉన్న అన‌సూయ‌ను చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యపోతున్నారు. రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా చెద‌ర‌ని ముద్ర వేసిన అన‌సూయ పుష్ప‌లో దాక్షాయ‌ణిగా ఎలాంటి ముద్ర‌ను వేస్తుందోన‌ని అనుకుంటున్నారు.

ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. పుష్ప ది రైజ్ పేరుతో తొలి భాగం డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story