బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే ఇంట్లో విషాదం

Ananya Panday's Grandmother Dies In Mumbai.బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె నాన‌న‌మ్మ‌,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2021 3:56 AM GMT
బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే ఇంట్లో విషాదం

బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే ఇంట్లో విషాదం నెల‌కొంది. ఆమె నాన‌న‌మ్మ‌, సీనియ‌ర్ న‌టుడు చుంకీ పాండే త‌ల్లి స్నేహ‌ల‌తా పాండే క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 85 సంవ‌త్స‌రాలు. వ‌యోభారం కార‌నంగా ముంబైలోని బాంద్రాలో గ‌ల త‌మ నివాసంలో ఆమె శ‌నివారం తుదిశ్వాస విడిచారు. చుంకీ పాండే, తల్లి స్నేహ‌ల‌తా వేర్వేరు చోట్ల నివాసం ఉంటున్నారు. విష‌యం తెలియ‌గానే చుంకీ పాండే, ఆయ‌న భార్య భావ‌న‌, కుమారైలు అన‌న్య పాండే, చిన్న‌కూతురు రిసా హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు.

ఆమె అంత్య‌క్రియ‌లు శ‌నివారమే పూర్తి చేశారు. త‌ల్లికి చుంకీ పాండే త‌ల‌కొరివి పెట్టారు. అంత్య‌క్రియ‌లకు అన‌న్య‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వీటికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. అన‌న్య పాండే..స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 చిత్రంతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప‌తి ప‌త్ని ఔర్ వాహ్‌, ఖాలీ పీలీ వంటి చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతున్న లైగ‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెర‌కెక్క‌తోంది. ఈ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. లాక్‌డౌన్‌కి ముందు ముంబైలోఈ మూవీకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. త్వ‌ర‌లో లైగ‌ర్ త‌దుప‌రి షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

Next Story