హీరోయిన్ అంజలికి కరోనా.. క్లారిటీ ఇచ్చేసిందిగా..

Anajli gives clarity about she got coronavirus.తాజాగా హీరోయిన్ అంజ‌లి కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్లు ప‌లు వెబ్ సైట్ల‌లో వ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 7:09 PM IST
Anjali

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. సామాన్యులు, ధ‌నికులు అన్న తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. అయితే.. మ‌రీ ముఖ్యంగా సినీ ఇండ‌స్ట్రీలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే చాలా మంది సినీ ప్ర‌ముఖులకు ఈ మ‌హ‌మ్మారి సోక‌గా.. తాజాగా హీరోయిన్ అంజ‌లి కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్లు ప‌లు వెబ్ సైట్ల‌లో వ‌చ్చింది.

'వ‌కీల్ సాబ్' చిత్రంలో అంజ‌లి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రంలో న‌టించిన మ‌రో హీరోయిన్ నివేదా థామ‌స్ తో క‌లిసి అంజ‌లి సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంది. కాగా.. ఇటీవ‌ల నివేదా థామ‌స్‌కు క‌రోనా వ‌చ్చింది. దీంతో అంజ‌లికి కూడా క‌రోనా సోకిన‌ట్లు ప‌లు వెబ్‌సైట్లు వార్త‌లు రాయ‌డంతో అంతా నిజ‌మేన‌ని అనుకున్నారు. అయితే.. తాజాగా దీనిపై అంజ‌లి క్లారిటీ ఇచ్చారు. అది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది.

'నాకు కరోనా రాలేదు. కొన్ని వెబ్ సైట్లలో నాకు కరోనా వచ్చిందనే వార్తలు రాసినట్టు నా దృష్టికి వచ్చింది. అది ఫేక్ న్యూస్.. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి' అంటూ తన మంచి కోరుకునే వారికి, తన అభిమానులకు, ఫ్రెండ్స్ కు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది అంజలి. దీంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' తో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది అంజలి.




Next Story